తెలంగాణలో మరో గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య

-

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పదవ తరగతి విద్యార్థిని అస్మిత అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి ఎన్టీఆర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి విద్యార్థిని అస్మితది సూర్యాపేట జిల్లా మోతే మండలం బుర్కచర్ల స్వగ్రామం.

ఇంటర్ సెకండియర్ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య ఘటన మరవక ముందే మరో విద్యార్థిని మృతి చెందింది. ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత రాత్రి పొద్దుపోయిన తర్వాత స్వగ్రామానికి అస్మిత మృతదేహం తరలించారు. అస్మిత మృతదేహానికి పోస్టుమార్టం నిరాకరించింది తల్లి. ఇక అటు చైతన్యపురి పోలీస్ స్టేషన్ మేరకు 173 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు మోతే పోలీసులు. అనంతరం స్వగ్రామం బుర్క చర్ల నుంచి సూర్యాపేటకు పోస్టుమార్టం కొరకు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news