గవర్నర్ తమిళి సై ట్విట్టర్ హ్యాక్ కేసు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..!

-

గవర్నర్ తమిళి సై  ట్విట్టర్ అకౌంటు జనవరిలో హాక్ అవ్వగా.. రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ అకౌంట్  హ్యాక్ కేసు విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై నుంచి గవర్నర్ తమిళి సై ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఓ బోటిక్ వైఫై ని దుండగుడు వినియోగించినట్లు తేల్చారు.  బోటేక్ నిర్వాహకురాలని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే బోటిక్ షాపు కొద్ది రోజులుగా మూసి ఉన్నట్టు తెలిస్తోంది.

ఆ షాపు  నిర్వాహకురాలని ప్రశ్నించిన పూర్తి సమాచారం తెలియకపోవడం గమనార్హం. తెలంగాణకు చెందిన కీలక వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లు వరుసగా యాప్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జన మాజీ మంత్రి కేటీఆర్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇలా సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి అయితే గవర్నర్ తమిళ్ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .

Read more RELATED
Recommended to you

Latest news