వంగి కొబ్బరికాయ కొట్టలేని వాడు చంద్రబాబుని ముసలి వ్యక్తి అంటున్నాడు ఆయనతో తిరుపతి మెట్ల ఎక్కే దమ్ముందా జగన్ అని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఛాలెంజ్ చేశారు శంఖారావం లో భాగంగా మాడుగుల నియోజకవర్గం ఘాట్ రోడ్డు సమీపంలో సభ నిర్వహించారు చంద్రబాబు పవన్ అన్నలు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి అని అన్నారు వాటితో పాటు సూపర్ సిక్స్ పథకాలని సైతం తూచా తప్పకుండా అమలు చేసేందుకు ప్రణాళికలు చేసినట్లు చెప్పారు.
సొంత తల్లి చెల్లి నమ్మని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎలా విశ్వసిస్తారని అన్నారు సొంత అన్న ని గద్దె దించడానికి షర్మిల సిద్ధమైంది అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. సైకిల్ గాజు గ్లాసులపై విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీ ఫ్యాను రెక్కలు విరిగిపోయినట్లే పీకి చెత్తబుట్టలో వేసుకోవాల్సిందే అని అన్నారు.