మార్చి 1న ఎన్టీఆర్ ‘సింహాద్రి’ రీరిలీజ్

-

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొంత కాలంగా రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు సంబంధించిన పుట్టినరోజునో, మరో ప్రత్యేకమైన రోజునో వాళ్లు నటించిన హిట్ చిత్రాలను 4K టెక్నాలజీలోకి మార్పు చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు . ఈ క్రమంలో హీరోల బ్లాక్ బస్టర్ మూవీలు మళ్లీ రీరిలీజ్ అవుతుండటంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంటోంది.

 

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘సింహాద్రి’ సినిమాని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 1న గ్రాండ్గా రీరిలీజ్ అవుతుందని పోస్టర్ విడుదల చేశారు. గతేడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన కూడా ‘సింహాద్రి’ రీరిలీజైన సంగతి తెలిసిందే.ఈ చిత్రం తొలిరోజు హౌస్‌ఫుల్ షోస్‌తో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది .ఈ మూవీ ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న పవన్ ‘ఖుషి’ సినిమా కలెక్షన్‌ను ‘సింహాద్రి’ దాటేసింది.వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.5.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news