హైదరాబాద్ నగరానికి మంచి నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక చెరువులను స్టోరేజీ ట్యాంకులుగా ఉపయోగించుకోవాలని సూచనలు చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగు నీటి సరఫరా అయ్యేలా ప్రణాళిక రచించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఔటర్ రింగు రోడ్డు బయట ఉన్న చెరువులను క్లస్టర్లుగా విభజించాలని సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే 50 ఏళ్ల తాగు నీటి అవసరాల కోసం ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించిన సీఎం… హైదరాబాద్‌లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో ఏవైనా ప్రారంభోత్సవాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాలని అధికారులకు సీఎం సూచనలు చేశారు. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.