వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ సందర్భంగా ఆయన టీడీపీ జనసేన పొత్తుల మీద విమర్శలు గుప్పించారు. టీడీపీ జనసేన పొత్తు చూసి ఓటు వేయాలా అని అన్నారు.
రాష్ట్రంలో ప్రజలు వైసిపిని రెండవసారి అధికారం లోకి తీసుకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు టిడిపి బలహీనతలు బయటపడ్డాయని మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు. తుప్పు పట్టిన సైకిల్ పగిలిపోయిన గ్లాసు కు గోల్డ్ కోటింగ్ వేసుకొని జనం ముందుకి వచ్చారని అన్నారు.