మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేయగా నిన్న ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ప్రతిపక్ష టిడిపి జనసేన కూటమి తొలి లిస్టులో తన పేరు లేకపోవడంతో టీడీపీ కంచుకోట పెనుకొండలో అసమ్మతి చిచ్చు రాజుకుంది. ఇక్కడ సవితమ్మను టీడీపి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఆయన అనుచరులు ఫైర్ అయ్యారు. ఆమెకు సహకరించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో పార్థసారథికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. చంద్రబాబును కలిసేందుకు ఆయన అమరావతి వెళ్తున్నారు. ఇక్కడ 1994-2004 వరకు పరిటాల రవి, 2005లో పరిటాల సునీత, 2009, 14లో పార్థసారథి టీడీపీ నుంచి గెలిచారు.