ఇన్స్టాలో విరాట్ కోహ్లీ రికార్డ్.. ఆ ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా సెన్సేషన్

-

టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్కు దూరంగా ఉన్న కోహ్లి ఇటీవలే మరోసారి తండ్రయిన విషయం తెలిసిందే. కోహ్లి సతీమణి అనుష్క ‘అకాయ్’ అనే పండంటి బాబుకు జన్మనిచ్చిన విషయం ఈ జంట ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే కుమారుడు పుట్టిన ఆనందంలో ఉన్న విరాట్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్తో పాటు తాను అప్లోడ్ చేసిన మరో ఆరు పోస్ట్‌లకు.. ప్రతి దానికి దాదాపు 10 మిలియన్లకు పైగా లైక్స్ అందుకున్నాడు. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో 6 పోస్ట్‌లకు 10 మిలియన్లకు పైగా లైక్‌లు పొందిన తొలి భారతీయుడిగా కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేశాడు.

అకాయ్ పుట్టిన ఆనందాన్ని విరాట్ తన ఫ్యాన్స్తో ఓ స్వీట్ పోస్ట్ ద్వారా పంచుకుంటూ.. ఆ చిన్నారి పేరును రివీల్ చేస్తూనే తనను ఆశీర్వదించమంటూ కోరాడు.’మేం ఫిబ్రవరి 15న మా బేబి బాయ్ అకాయ్ (వామికకు తమ్ముడు)ను ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. మా జీవితంలో ఇవి మధురమైన క్షణాలు. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’ అని విరాట్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరాట్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news