తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24న నిర్వహించాలి -TTD

-

 

TTD: ఇవాళ టీటీడీ మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. 9 వేల ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది TTD.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9వేల అవుట్ సోర్సింగ్,కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచినట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇక పై నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని…తిరుమల శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద వున్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయిస్తామన్నారు. 4 కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బోట్టులు తయ్యారి..నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయింపులు చేస్తున్నట్లు వివరించారు. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పుకొచ్చారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి.ఇక పై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు. అటవీ కార్మికుల జీతాలు పెంచుతున్నామని…వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు 8.16 కోట్లు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. 3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news