తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆరే – బుద్దా వెంకన్న

-

తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆరే అని కొనియాడారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయినా తెలంగాణ ఉద్యమాన్ని చేసింది కేసీఆర్ కాబట్టి తెలంగాణ తెచ్చిన పేరు కేసీఆర్‌కే వస్తుందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. కేశినేని నాని ఓ దరిద్రుడు…కేశినేని ఓ కోవర్టు అంటూ ఫైర్‌ అయ్యారు. నేను ఫ్లై ఓవర్ కోసం ఉద్యమం చేస్తే చంద్రబాబు కట్టారు…నాకు పేరు వస్తదని ఫ్లై ఓవర్ నేను తెచ్చానని కేశినేని నాని ప్రచారం చేసుకున్నాడని మండిపడ్డారు.

నన్ను ఇంఛార్జి గా తప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడని.. కేశినేని నానిపై నిప్పులు చెరిగారు. రాజీనామా చేస్తా అని చంద్రబాబుతో చెప్పి కో ఆర్డినేటర్ పదవి తెచ్చుకున్నాడన్నారు.
వెల్లంపల్లి తో కలిసి కోవర్ట్ గా పనిచేశారు…కేశినేని నానికి చెర ఏంటో నేను చూపిస్తానని హెచ్చరించారు. నాని ఢిల్లీలో ఎవరికి తెలుసు అన్నారు. టీడీపీలో కోవర్ట్ పరిచయాలతో నాకు అడ్డు పడుతున్నాడని నిప్పులు చెరిగారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news