మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ నేత కేటీఆర్ నిన్న నాగర్ కర్నూలు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి పై ఇష్టానుసారంగా మాట్లాడారని అన్నారు. ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా హైమాండ్ ప్రకటిస్తే బిఆర్ఎస్ కి మూడు సీట్లు వచ్చేవని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని చెప్పారు. అలానే అయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు భయపడి పోయారు. వాటి కష్టసుఖాలు చెప్పుకునేందుకు అవకాశం లేదని చెప్పారు.
ప్రస్తుతం స్వేచ్ఛగా సెక్రటేరియట్ కు ప్రజలు తరలి వస్తున్నారని కూడా అన్నారు. గతంలో మంత్రులకు ఎలాంటి అధికారులు లేవు. ఏసీ బంగ్లాలు, ఏసీ కార్లు, ఏసీ ఛాంబర్లు తప్ప అని మల్లు రవి అన్నారు. కేటీఆర్ పుట్టు గుడ్డి, పుట్టు చెవిటి. అందుకనే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక పోతున్నారు.