బీజేపీ పార్లమెంటు ఎన్నికల కోసమే రాజకీయాలు చేస్తోంది అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. కేంద్రంలో పది సంవత్సరాలు అధికారం లొ ఉన్నా విభజన చట్టం హామీలు బీజేపీ నెరవేర్చలేదు అన్నారు. బీజేపీని రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. మోడీ హామీ ఇచ్చిన పసుపు బోర్డు ఎటు పొయింది. ఎన్నికల కోడ్ ముందు మోడీ రాష్ట్రంలో పర్యటనలు చేసి హడావుడి చేయడం తప్ప చేసేది ఏం లేదు అని అన్నారు.
యూపీలో 19,150 కోట్లతో మోడీ కార్యక్రమాలు చేశారు అలానే ఏపీలో ఐ.ఐ.ఎం,ఐ.ఐ.టీ లాంటి సంస్థలను ప్రారంభించారు వారణాసిలో 13 వేల కోట్లతో అభివృద్ధి పనులు మోడీ చేశారు. మూడు నెలల కింద తెలంగాణకు సంబంధించిన పలు ప్రకటనలు ,శంఖుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించిన మోడీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు.