ప్రతి నెలా, ప్రతి పేద కుటుంబానికి 5000 రూపాయలు ఇస్తాం : మల్లిఖార్జున ఖర్గే

-

మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది.ఇవాళ అనంతపురంలో ‘న్యాయ సాధన’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్ కమ్ సపోర్ట్ పథకం తీసుకొస్తామని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. దీని ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.5,000 ఇస్తామని ప్రకటించారు. ఈ రోజు అనంతపురంలో ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభలో  ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో సమావేశం కానుంది. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది.

 

ఈ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ…..ప్రజలకు మేలు చేయాలనే తాను రాజకీయాల్లోకి వచ్చానని,ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటా అని తెలిపారు. చెల్లి అని కూడా చూడకుండా మీ సోషల్ మీడియాలో నన్ను దూషిస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు . నీ కోసం ఇదే చెల్లెలు 3200KM పాదయాత్ర చేసి పార్టీని నడిపించలేదా?. జగన్ మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నారు అని అన్నారు. నేను YSR బిడ్డను. భయపడను’ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news