కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ ఎనిమిదోసారి నోటీసులు

-

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ కి సంబంధించి విచారణకు మార్చి 04న రావాలని పేర్కొంది. ఇలా కేజ్రీవాల్ కి ఈడీ సమన్లు ఇవ్వడం ఇది ఎనిమిదో సారి. ఏడోసారి ఇచ్చిన నోటీసుల గడువు ముగిసిన మరుసటి రోజునే మరోసారి సమన్లు జారీ కావడం గమనార్హం.

ఢిల్లీ మద్యం కేసులలో అరవింద్ కేజ్రీవాల్ కి నవంబర్ 2న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మొదటిసారి సమన్లు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులను పంపిస్తున్నప్పటికీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం హాజరు కావడం లేదు. ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్న తరుణంలో ఈడీ నోటీసులు పంపించడం చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు. ఇలా పదే పదే సమన్లు జారీ చేయడం సరికాదని.. కోర్టు ఆదేశాలు వెలువడే వరకు ఓపికతో వేచి ఉండాలని ఈడీని ఆప్ కోరింది. తాజాగా మరోసారి సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసులో విచారణ తరువాత జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ కొద్ది రోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు పై ఇటీవలే కోర్టు నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. అభ్యర్థన మేరకు తదుపరి విచారణకు మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news