విపక్షాలు చేసే విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలి : సీఎం జగన్

-

వైసీపీ గెలిస్తే.. వాలంటీర్ల వ్యవస్థతో సుపరిపాలన అందిస్తాం.. లేదంటే జన్మభూమి కమిటీల అరాచకం మొదలవుతుందన్నారు సీఎం జగన్. విపక్షాలు చేసే విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని తెలిపారు. వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. రేపటి నుంచి 45 రోజులు కీలకం అన్నారు. బూత్ కమిటీల పరిధిలోని ఓటర్లను ఎన్నికలలోపు 5 లేదా 6 సార్లు కలవాలన్నారు. సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు.

దాదాపు అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు ఖరారు అయ్యారని తెలిపారు. నియోజకవర్గం కో ఆర్డినేటర్లే ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్పారు. దాదాపు సిట్టింగ్ లందరికీ టికెట్ ఇవ్వనున్నట్టు సమాచారం.  రేపటి నుంచి 45 రోజుల పాటు సమన్వయంతో అందరూ కలిసి మెలిసి పని చేయాలి. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత త్వరగా యాక్టివేట్ చేయండి అని సూచించారు. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు సీఎం జగన్. 

Read more RELATED
Recommended to you

Latest news