ఆత్మ గౌరవానికి భంగం కలిగింది: గొల్లపల్లి సూర్యారావు

-

టిడిపికి దూరంగా జరిగి వైఎస్ఆర్సిపి కి దగ్గరయ్యారు. సీనియర్ నేత గొల్లపల్లి సూర్యరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడుకి ఈమేరకు రాజీనామా లేఖని పంపించారు. ఆ లేఖలో రాజకీయ ప్రస్తానని మొత్తం రాశారు. 1981 నుండి కొత్తపేట సమితి అధ్యక్షుడిగా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించాను. స్వర్గీయ ఎన్టీఆర్ వైయస్సార్ మంత్రి వర్గాల్లో సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాను.

2014 నుండి 19 వరకు శాసనసభ్యునిగా మీకు గాని పార్టీకి గాని ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా టీడీపీ గౌరవాన్ని నిలిపిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు తెలుసు ఇలా ఆయన తన రాజకీయ ప్రస్థానం అంతా కూడా వివరించారు. నా రాజీనామని ఇప్పుడు ఆమోదించండి నన్ను అభ్యర్థిగా ప్రకటించే అర్హతలు ఉన్నప్పటికీ నా పేరుని పరిగణలోకి తీసుకోకపోవడం నాకు అత్యంత బాధ కలిగించింది అని లేఖలో రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news