స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించమని హామీ ఇవ్వండి.. నెల రోజుల్లో రూ.8వేల కోట్లు జమ చేస్తా : కేఏ పాల్

-

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవెటీకరణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను విక్రయించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే బిలియనీర్లయిన తన విదేశీ మిత్రుల సాయంతోపాటు తన సొమ్ము కూడా కలిపి మొత్తం రూ.8 వేల కోట్లను మొదటి విడతలో నెల రోజుల్లోనే జమ చేస్తానని హైకోర్టుకు విన్నవించారు.

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిల్‌పై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌.విజయ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పాల్‌ బుధవారం రోజున హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్లాంట్‌కు చెందిన వేల ఎకరాలు ఇప్పటికే విక్రయించారని తెలిపారు. కేవలం 16 వేల ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని, ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా అడ్డుకోవాలని, భూముల విక్రయ ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై గతంలో దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలు, ఓ వ్యాజ్యాన్ని ప్రస్తుత పిల్‌తో జత చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను మార్చి రెండో వారానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news