కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కథానాయికగా నటిస్తున్నారు.వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ గా వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని నటుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘పోలీస్ క్యారెక్టర్ 6 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుందని, 5 అడుగుల 3 అంగుళాల వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకుంటే సారీ. కావాలని అన్న మాటలు కాదు. క్షమిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.