అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో స్పెషల్ అట్రాక్షన్ గా ధోనీ క‌పుల్‌

-

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టన్నింగ్ లుక్లో కనిపించారు. భారత సంపన్నుడు ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన ధోనీ బాలీవుడ్ హీరోను తలపించారు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు చాలా మంది స్టార్స్ వ‌చ్చారు. అయితే ఆ ఈవెంట్‌లో క్రికెట‌ర్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా స్పెష‌ల్‌గా కనిపించాడు.

బ్లాక్ సూట్లో సతీమణి సాక్షితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ధోనీ స్టన్నింగ్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.స్లీక్ ష‌ర్ట్, బ్లేజ‌ర్ వేసుకున్న ధోని త‌న ఫిజిక్‌తో అట్రాక్ట్ చేశాడు. ధోనీకి త‌గిన‌ట్లే తన వైఫ్ సాక్షీ కూడా బ్లాక్ డ్రెస్సులో మెరిసింది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఇద్దరు ప్ర‌త్యేకంగా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.42 ఏళ్ల వయసులోనూ ధోనీ కుర్రాడిలా కనిపిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news