రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇంకో ట్విస్ట్..!

-

గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో ఇంకో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే హోటల్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానంద టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తో పాటుగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇంకో వ్యక్తి పై కేసు నమోదు చేశారు తాజాగా ఈరోజు రాడిసన్ హోటల్ ఆపరేషన్ మేనేజర్ మీద కేసు ఫైల్ చేశారు.

రాడిసన్ హోటల్ లో 1200, 1204 రూములలో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని తనిఖీల్లో భాగంగా హోటల్ లోనే డ్రగ్స్ దొరికాయని హోటల్ ఆపరేషన్ మేనేజర్ మీద కేసు నమోదు చేశారు హోటల్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ముందే తెలిసి రూమ్స్ ఇచ్చారని పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ పోలీసులు విచారణకి హాజరు అయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news