సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి?: చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ చేసిన అప్పులపై సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ధ్వజమెత్తారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండె లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని చంద్రబాబు ట్వీట్ చేశారు.

సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ అని చంద్రబాబు ట్విటర్లో ఏపీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని రూ. 370 కోట్లకు తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ సీఎంకి తెలుసా అని నిలదీశారు.

“జగన్‌ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని నాశనం చేశారు. అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో ప్రజలు ఏం కోల్పోతున్నారో ఆలోచించాలి.” అని ప్రజలకు చంద్రబాబు నాయుడు విజ్ఙప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news