రాజకీయాల్లో ఏ నాయకుడికైనా ప్రత్యర్థులు కామన్. అసలు ఆమాటకొస్తే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు. సమయాను కూలంగా వ్యవహరించే నాయకులే ఉంటారు. అయితే, ఏపీలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రభుత్వాధినేత, సీఎం జగన్ రాజకీయంగా శత్రువులను పెంచు కుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత సాదారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పార్టీపై సానుభూతి, ఫాలోయింగ్ అనేవి పెరగాలి. అంటే.. టీడీపీలో ఓడిన లేదా అప్పటి వరకు ఉన్న కేడర్ పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా మారిన పరిస్థితి గమనించాం.
కానీ, ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. టీడీపీలో తటస్థంగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి వర్గం కానీ,కోట్ల వర్గం, సబ్బం హరి ఇలా అనేక మంది టీడీపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రత్యామ్యాయంగా పార్టీలను వెతుక్కొవడం సహజంగా పార్టీల్లో జరుగుతుంది. ఈ నేపథ్యం లో నేరుగా వచ్చి పార్టీలో చేరకపోయినా.. అధికార పార్టీకి అంతో ఇంతో మద్దతుగా మాట్టాడే ప్రయత్నం చే స్తారు. కానీ, ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. దీనికి జగన్ అనుసరిస్తున్న విధానాలే కారణం గా కనిపిస్తున్నాయి. ఆయన ముక్కు సూటిగా వ్యవహరిస్తుండడమే దీనికి కారణంగా చెబుతున్నా రు.
ఇక, పార్టీలోనూ నేతలకు స్వతంత్రత లేదనే ప్రచారం కూడా సాగుతోంది. ఎక్కడికక్కడ నాయకులకు బంధాలు వేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సఖ్యత లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదికూడా రాష్ట్రంలో వైసీపీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టే ప్రమాదం ఉందనేది వాస్తవం. ఇక, ప్రభుత్వంపైనా, జగన్ కేంద్రంగా పవన్ వంటి నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధా నం చెప్పుకొనే పరిస్థితి కూడా లేకపోవడం గమనార్హం. ఇది మరింత మైనస్‌గా మారిపోయింది. నిజానికి టీడీపీ ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేస్తే.. ప్రతి జిల్లా నుంచి కూడా నాయకులు రంగంలోకి దిగి.. ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టేవారు.
కానీ, నేడు అలాంటి పరిస్థితి లేకుండా పోవడం గమనార్హం. పక్క రాష్ట్రం తెలంగాణతో సఖ్యత కూడా చెడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. గోదావరి నది ఎత్తి పోతల పథకంపై ఇరువురు సీఎంలు ముచ్చటించుకుని, కలిసి వెళ్లాలని అనుకున్నారు. కానీ, పరిస్థితి బెడిసి కొట్టింది. దీంతో మళ్లీ ఇరు వురు సీఎంల మధ్య పరిస్థితి సైలెంట్‌గా మారిపోయింది. ఇక, తమిళనాడు రాష్ట్రం నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ జగన్‌కు కలిసి వస్తున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆయనకు శత్రువులు పెరుగుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇటు ఇంటా.. అటు బయటా కూడా శత్రువులను పెంచుకుంటూ పోతే.. పరిస్థితి ఇబ్బందేనని అంటున్నారు.