తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని CM రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘1994 నుంచి 2004 వరకు తెలుగు దేశం పార్టీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి అని అన్నారు. కేసిఆర్ ఇంట్లో పడుకుంటే కుటుంబ సభ్యులు ఆయనను లేపి TV చూపించండి అని సూచించారు.
పాలమూరు సభ సాక్షిగా చెబుతున్న కేసిఆర్.. నా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఆన.. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ మండిపడ్డారు. ‘కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీ పది సంవత్సరాలు పీఎంగా ఉండొచ్చు కాని పేదోళ్ల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనివ్వరా? అని మండిపడ్డారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటే ఓర్వలేకపోతున్నారా? ఎవడైనా మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పాలమూరు బిడ్డలు మానవబాంబులు అవుతారు అని హెచ్చరించారు. తొక్కి పేగులు తీసి మెడలో వేసుకుంటాం బిడ్డా..’ అని వారిని ఇచ్చారు.