5 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు వేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే.. రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటనపై రైతులు ఫైర్ అవుతున్నారు. 3 ఎకరాలలోపు వారికే రైతు బంధు పడిందని చెబుతున్నారు రైతులు. కానీ రేవంత్ మాత్రం…5 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు వేశామని అంటున్నాడని ఆగ్రహించారు.
ఇక నిన్న పాలమూరు సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పాలమూరు సభ సాక్షిగా చెబుతున్న కేసిఆర్.. నా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఆన.. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది’ అని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి . కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ మండిపడ్డారు. ‘కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీ పది సంవత్సరాలు పీఎంగా ఉండొచ్చు కాని పేదోళ్ల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనివ్వరా? అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.