మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. మహిళా వృద్ధాశ్రమాన్ని ఆమె తో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తల్లి సుశీలమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన మహిళ వృద్ధాశ్రమముని ప్రారంభించడం జరిగింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సతీమణి లక్ష్మి 11 కోట్లు వెచ్చించి ఆర్థిక సహకారం అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. జనగామకి చెందిన రాణి రుద్రమదేవి మహిళా సొసైటీ ఈ ఆశ్రమానికి 2017 లో శ్రీకారం చుట్టింది అయితే దీనిని పూర్తి చేయడం హర్షణీయమని సీతక్క అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఎలాంటి లోటు లేకుండా సాదాల్చిన అవసరం ఉందని సీతక్క అన్నారు.