సీఎం రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు..గుడ్డి గుర్రం : ఎమ్మెల్సీ కవిత ఫైర్

-

ముచ్చట్లు చెప్పే సీఎంగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని, ముచ్చటగా మూడునెలలే ఉండేటట్లు ఉన్నారని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జీవో 3ను రద్దు చేయాలని కోరుతూ భారత జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టారు. జీవో 3 రద్దు చేయాలని, జీవో 41 అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. వద్దురా నాయాన కాంగ్రెస్ పాలన.. మహిళ వ్యతిరేకి కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రావాల్సిన వాటా వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి నిరుద్యోగులు బస్సు యాత్రలు చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల హక్కులను కాలరాస్తుందని దుయ్యబట్టారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను హరించే జీవో 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు పేరు చెప్పి ఆడ బిడ్డల గొంతు కోయవద్దని కోరారు. లోక్ సభ ఎన్నికల్లోనూ దక్కని టికెట్ సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు జరిపిన నియామకాల్లో ఎంత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాయన్న దానిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news