మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎంఎల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మన్నే జీవన్ రెడ్డి పేరు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీకి ఎన్ నవీన్ కుమార్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ నిర్ణయించారు.
కాగా, లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 36 మందితో తొలి జాబితా ప్రకటించింది. అందులో తెలంగాణకు చెందిన నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్- సురేశ్ షెట్కార్, నల్గొండ- కుందూరు రఘువీర్,చేవెళ్ల- సునీతా మహేందర్ రెడ్డి, మహబూబాబాద్- బలరాం నాయక్ పేర్లను ప్రకటించింది.అంతేకాకుండా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ (కేరళ) నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.