ఈ సినిమా వల్లే మానసిక స్థితి మెరుగుపడింది: భూమి పెడ్నేకర్

-

బాలీవుడ్ నటి భూమి పడ్నికర్ ఫుల్ ఫామ్ లో దూసుకు వెళ్ళిపోతున్నారు ఎక్కువ మహిళా ప్రాధాన్యమున్న పాత్రని ఎంచుకుంటున్నారు. కథ బలమున్న చిత్రాల వైపు దృష్టి పెడుతున్నారు. సందేశాత్మక సినిమాలతో ప్రేక్షకుని ఆకట్టుకుంటున్నారు. భక్షక్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకి ఇటీవల వచ్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తరికెక్కించిన ఈ సినిమా హిట్ ని అందుకుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు. కాలం చాలా మారిపోయింది. థియేటర్కల్ రిలీజ్ అంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లని రాబట్ట లేకపోయినా ప్రశంసలు అందుకుంటాయి. ముందు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు కలెక్షన్ నెంబర్ గేమ్ నుండి బయటపడాలి. థియేటర్కల్ ఓటీటీ రెండు నా దృష్టిలో ముఖ్యమే భక్షక్ లో జర్నలిస్టుగా నా పాత్రకి చక్కని ప్రాధాన్యం ఉంది ఈ సినిమా కారణంగా నాకు మానసిక స్థితి మెరుగుపడింది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news