TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..వారికి 5 లక్షలు పరిహారం !

-

టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు..తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారస్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కొసం అదనంగా భవనాలు నిర్మాణానికీ నిర్ణయం తీసుకుంది. 2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్టు, పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు చేసింది. యాత్రి సముదాయంలో లిఫ్ట్ లు ఏర్పాటుకు 1.88 కోట్లు కేటాయించనుంది.

బాలాజినగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. 14 కోట్లతో టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునికరణ చేయనుంది. గోవిందరాజ స్వామి ఆలయంలో బాష్యాకర్ల సన్నిధిలో మకరతోరణం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఐటీ సేవల కొసం 12కోట్ల నిధులు మంజూరు చేసింది టీటీడీ పాలకమండలి. శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆమోదం తెలిపింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబంకు 5 లక్షలు పరిహారం ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news