మంచు పడుతుంది ఈ రెండు నెలలు జాగ్రత్త… నిఘా వర్గాల వార్నింగ్…!

-

జమ్మూ కాశ్మీర్ కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే… ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు పలు మార్లు అనేక హెచ్చరికలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబై మీద దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు చేస్తున్నాయి. పాకిస్తాన్ గూడచారి సంస్థ ఐఎస్ఐ భారతదేశంలో దాడులకు ఇప్పటికే కీలక ఉగ్రవాదులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరికలు జారి చేసాయి.

ఇప్పుడు తాజాగా విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. దక్షినాదిలోని కర్ణాటక, హైదరాబాద్, తమిళనాడులోని చెన్నై, కేరళలోని తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు చేసినట్టు సమాచారం. అయ్యప్ప దీక్షలతో కేరళలో ఇప్పుడు అంతా భక్తి వాతావరణం నడుస్తుంది. ఇక దీనికి తోడు మంచు కూడా ఎక్కువగా కురుస్తుంది. దీని మీద ఉగ్రవాదులు ఫోకస్ చేసినట్టు సమాచారం, భక్తుల లక్ష్యంగా కాల్పులు జరిపే అవకాశం ఉందని అంటున్నారు.

జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ప్రాంతాల్లో మంచు ఎక్కువగా కురుస్తుంది… దీనిని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని, వాఘా సరిహద్దుల సమీపంలో భద్రతను మరింత పెంచాలని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తుంది. రాజస్థాన్ లో కూడా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని… అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా… మహారాష్ట్ర, గోవా లో వారు చొరబడే అవకాశం ఉందని, ప్రస్తుతం కురుస్తున్న మంచుని ఆధారంగా చేసుకుని దాడులకు సిద్ధమయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారి చేసారు. ముఖ్యంగా దేవాలయాలు ఎక్కువగా ఉన్న చోట భద్రతను మరింత పెంచాలని సూచించారు. ఇక తీర ప్రాంతాల్లో కూడా గస్తీ పెంచాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news