రష్యాలో ఎన్నికలు.. మరోసారి అధ్యక్ష పీఠం పుతిన్దే!

-

రష్యా చరిత్రలోనే మొదటిసారిగా అధ్యక్ష పదవికి మూడు రోజులపాటు ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే నాలుగు సార్లు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన వ్లాదిమిర్ పుతిన్ ఈసారి కూడా పదవి కోసం పోటీ పడుతున్నారు. సోవియట్‌ యూనియన్‌ పాలకుడు జోసఫ్‌ స్టాలిన్‌ కంటే ఎక్కువ కాలం రష్యాను పరిపాలించిన వ్యక్తిగా నిలిచిన పుతిన్‌ మరోసారి అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. అందుకోసం రాజ్యాంగ సవరణ చేసి మరీ ఎన్నికల బరిలో నిలిచారు.

ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే పుతిన్ మరో ఆరేళ్ల పాటు రష్యా అ‍ధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థులుగా కేవలం ముగ్గురు అభ్యర్థులే ఉన్నారు. పుతిన్‌ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ ఇటీవల జైలులోనే మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇతర ప్రత్యర్థులు ప్రవాసంలోనో, జైళ్లలోనో ఉన్నారు. మిగిలిన ముగ్గురు లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన లియోనిడ్‌ స్లట్‌స్కీ, న్యూ పీపుల్‌ పార్టీ వ్లాదిస్లవ్‌ డవాంకోవ్‌, కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన నికోలోయ్‌ ఖరితోనోవ్‌ పుతిన్‌కు అనుకూలంగానే ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news