రాకింగ్ స్టార్ యశ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ

-

కేజీయఫ్ ఫేం రాకింగ్ స్టార్ యశ్ తన నెక్స్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. యశ్ హీరోగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోందని గతంలో సాయిపల్లవి పేరు వినిపించింది. ఆ తర్వాత మరో ఇద్దరు బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో యశ్కు జోడీగా నటించే బ్యూటీ ఎవరో ఓ క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బేబో కరీనా కపూర్.

 

బీటౌన్ బ్యూటీ కరీనా కపూర్ ‘క్రూ’ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను త్వరలో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్టుతో సౌత్ ఇండస్ట్రీలో అగుడు పెట్టబోతున్నట్లు చెప్పింది. అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని.. మొదటిసారి ఇలాంటి సినిమాలో తాను నటిస్తున్నానని తెలిపింది. ఇది విన్న ఫ్యాన్స్ ఈమె కచ్చితంగా యశ్ సినిమా గురించే మాట్లాడుతోందంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘టాక్సిక్’ హీరోయిన్ కరీనానే అంటూ గెస్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news