వాట్సప్ న్యూ అప్డేట్… ఇకపై 60 సెకండ్స్ స్టేటస్ ఫీచర్

-

ప్రస్తుత రోజులలో యువత స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేకపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వాడుకము విపరీతంగా పెరిగిపోయింది.గతంలో కాల్స్, మెసేజ్‌ల వరకూ ఫోన్లు పరిమితమై ఉండేది .కానీ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారడంతో అన్ని అవసరాలకు స్మార్ట్ ఫోన్స్ ప్రత్యామ్నాయంగా మారాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్స్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. ముఖ్యంగా మెసెజ్‌లను మాత్రమే కాకుండా ఆడియో, వీడియో ఫైల్స్‌తో పాటు యూపీఐ సహాయంతో పేమెంట్ చేసే సౌకర్యాన్ని కలిగించింది.

ఇక తాజాగా వాట్స్అప్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది.యూజర్లకు మరో రెండు కొత్త ఫీచర్లను అందించేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 30 సెకన్ల వీడియోను స్టేటస్ పెట్టుకునే అవకాశం ఉండగా, దాన్ని 60 సెకన్లకు పెంచనున్నట్లు వెల్లడించింది. అలాగే యూపీఐ ద్వారా వేగంగా చెల్లింపు చేసేందుకు మరో ఆప్షన్ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యాప్లో త్రిడాట్స్ పై సెలక్ట్చేసి, ఆ తర్వాత QR కోడ్ స్కాన్ చేయాల్సి ఉండగా, ఇకపై నేరుగా QR కోడ్ను స్కాన్ చేసేలా షార్ట్ కట్ ఆప్షన్ తీసుకురానుంది.

Read more RELATED
Recommended to you

Latest news