చర్మాన్ని తెల్లగా మార్చే గ్లూటాతియోన్‌.. ఇంజెక్షన్ల ద్వారా తీసుకోవడం ప్రమాదమే

-

చర్మం అందంగా , ప్రకాశవంతంగా మెరవాలని అందరూ అనుకుంటారు. దీనికోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. చాలా మంది గ్లూటాతియోన్ ఇంజెక్షన్‌ చేయించుకుంటారు. గ్లూటాతియోన్ మన శరీరంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. గ్లూటాతియోన్ అనేది మన శరీరంలో సహాజసిద్ధంగా లభిస్తుంది. దీనిని మన అవయవాలలో కీలకమైనదిగా చెప్పబడే కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అయితే కొన్ని రకాల కూరగాయలు, పండ్ల ద్వారా కూడా దీనిని పొందవచ్చు. ఇంజెక్షన్ల ద్వారా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయి.. అదే గ్లూటాతియోన్‌ను ఆహారం ద్వారా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు..!

కంటిశుక్లం , ఆస్తమా, క్యాన్సర్, గుండె జబ్బు, కాలేయ వ్యాధి, హెపటైటిస్, అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సకు గ్లూటాతియోన్‌ను ఉపయోగిస్తున్నారు. శరీరానికి గ్లూటాతియోన్ ఒక యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హానికరమైన పదార్ధాలను శరీరం నుండి బయటకు పంపటంలో సహాయపడుతుంది, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ముఖ్యంగా చర్మ ఆరోగ్యంతో దీనికి విడదీయరాని సంబంధం ఉంది. కొందరు చర్మ సౌందర్యం కోసం గ్లుటాతియోన్ ఇంజెక్షన్లను తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన పరిస్ధితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఏమాత్రం సురక్షితమైనది కాదని నిపుణులు చెబుతున్నారు. అదే క్రమంలో సహజ సిద్ధమైన ఆహారాల ద్వారానే గ్లూటాతియోన్‌ను పొందవచ్చని సూచిస్తున్నారు.

గ్లూటాతియోన్ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అకాల వృద్ధాప్యం, దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సమస్యలతో సహా వివిధ ఆరోగ్య సమస్యల నుండి రక్షణగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ యాంటీఆక్సిడెంట్ DNA ఉత్పత్తిలో ఉపకరిస్తుంది. గ్లూటాతియోన్ సహజంగా పొందాలంటే ; ఇంజెక్షన్లను ద్వారా తీసుకోకుండానే గ్లూటాతియోన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ఆహారాలు గ్లూటాతియోన్ ఉత్పత్తి పెంచటంలో సహాయపడతాయి. అవేంటంటే…

బ్రోకలీ: గ్లూటాతియోన్ బ్రోకలీలో అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం బ్రకోలీలో గ్లుటాతియోన్ సమృద్ధిగా ఉన్నట్లు నిర్దారరణ అయింది. అంతే కాకుండా బ్రకోలీని ఆహారంలో చేర్చుకోవటం ద్వారా శరీర సామర్థ్యాన్ని కూడా పెరుగుతుంది.

సల్ఫర్‌తో కూడిన కూరగాయలు: వెల్లుల్లి, ఉల్లిపాయలు, గ్లూటాతియోన్‌కు మంచి ఎంపికలు. వాటిలో అధిక స్థాయిలో సల్ఫర్ ఉంటుంది, ఇది శరీరం గ్లూటాతియోన్‌ను సంశ్లేషణ చేయడానికి తోడ్పడతాయి.

లీన్ ప్రోటీన్లు: చికెన్, చేపలు వంటి లీన్ ప్రొటీన్లు కలిగిన మాంసాహారాలు గ్లూటాతియోన్ ఉత్పత్తికి అవసరమైన సిస్టీన్ , మెథియోనిన్ వంటి అమైనో ఆమ్లాలను అందిస్తాయి.

పండ్లు మరియు కూరగాయలు: అవోకాడో, బచ్చలికూర మరియు ఓక్రాలో గ్లూటాతియోన్ ఉత్పత్తికి అవసరమైన పోషకాలు వీటిలో ఉంటాయి.

గ్లూటాతియోన్ ఇంజెక్షన్‌లను ఎందుకు తీసుకోకూడదు..

చాలా మంది అందం కోసం గ్లూటాతియోన్‌ను పొందేందుకు ఇంజెక్షన్ల రూపంలో తీసుకుంటారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపు తిమ్మిరి, ఉబ్బరం, దద్దుర్లు వంటి అలెర్జీ ప్రతిచర్యలు, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంటుంది. చర్మానికి సంబంధించిన విషయం కాబట్టి ఆహారం రూపంలో పొందటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news