రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ స్టోరీ ఇదేనంటూ నెట్టింట్లా వైరల్..!

-

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ స్టోరీని అమెజాన్ ప్రైమ్ తాజాగా రివీల్ చేసింది. పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ అని చెప్పింది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చెర్రీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

గేమ్ చేంజర్ రాంచరణ్ నటిస్తున్నటువంటి 15వ చిత్రం. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించినటువంటి పొలిటికల్, డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది.చరణ్ దీనిలో తండ్రీకొడుకులుగా కనిపించనున్నట్లు టాక్.ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్ర ఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news