టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య చిన్నల్లుడు మిల్లి శ్రీభరత్ పోటీకి లైన్ క్లియర్ అయింది. వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా మిల్లి శ్రీభరత్ పేరు ఖరారు అయింది. 2019 ముందు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు మిల్లి శ్రీభరత్. గత ఎన్నికల్లో వైజాగ్ ఎంపిగా పోటీ చేశారు మిల్లి శ్రీభరత్. అయితే… త్రిముఖ పోరులో సుమారు 4 వేల ఓట్ల తేడా ఓడిపోయారు శ్రీ భరత్. ఆ ఎన్నికల్లో రెండు లక్షల 80 వేల ఓట్లు సాధించారు జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీ నారాయణ.
దీంతో చివరికీ ఓటమి పాలయ్యారు మిల్లి శ్రీభరత్. ఇక ఈ సారి జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నాయి. మరి ఈ సారైనా మిల్లి శ్రీభరత్ గెలుస్తారో లేదో చూడాలి. కాగా…టీడీపీ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమాకు టికెట్ దక్కలేదు. టీడీపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల అయింది. అయితే.. ఈ లిస్ట్ లో ఎక్కడా కూడా టీడీపీ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా పేరు లేదు. దీంతో టీడీపీ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా పార్టీ మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి.