కేజ్రీవాల్ తో పని చేసినందుకు సిగ్గు పడుతున్న.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించిన అన్నా హాజరే

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన గురువు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కేజీవాల్ తప్పు చేశారు కాబట్టే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు అన్నాహజారే.. నాతో కలిసి పనిచేసి లిక్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్.. లిక్కర్ పాలసీలు చేశారు. తన సొంత పనుల కోసం పాలసీలు చేశారు కాబట్టి ఈడీ అరెస్ట్ చేసింది. అరవింద్ కేజ్రివాల్ తో కలిసి పని చేసినందుకు సిగ్గుపడుతున్నానన్నారు. కేజీవాల్ పరిస్థితి చూసి బాధగా అనిపించడం లేదని కేజ్రీవాల్  నా మాట వినలేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా నాతో ఉన్నపుడు నేను ఎల్లప్పుడూ దేశ సంక్షేమానికి ముందు ఉండాలని వారికి చెప్పాను.

కొత్త మద్యం పాలసీ విషయమై కేజ్రీవాల్ కి రెండు సార్లు లేఖలు రాశాను.. కానీ ఆయన ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నేను అతనికి ఎటువంటి సలహా ఇవ్వననన్నారు. చట్టం తనపని తాను చేస్తుందన్నారు. 2012లో అన్నా హజారే, కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఉద్యమం నేపథ్యం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించగా ఆ తర్వాతి క్రమంలో కేజీవాల్ రాజకీయాల్లో బిజీ అయిపోగా అన్నాహజారే సెలైంట్ అయిపోయారు. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఇదివరకే కేజీవాల్ పై అన్నాహజారే ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news