బ్రేకింగ్‌ : ఆంధ్రాలో ఆర్టీసి చార్జీల పెంపు… పెంచిన ధరలు ఇవే..!

-

ఆంధ్రాలో ఆర్టీసి చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణా ప్రభుత్వం చార్జీలు పెంచిన నేపధ్యంలో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చార్జీలు పెంచింది. బస్ చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రి పేర్ని నానీ మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థకి పేరుకుపోయిన నష్టాలు 6735 కోట్ల రూపాయలు కు చేరుకుందన్నారు. 2995 కోట్లు వివిధ అప్పులు అప్పులు ఉన్నాయని, 3740 కోట్లు.. బకాయిలు ఉన్నాయన్నారు.

2015 లో డీజిల్ ధర 50 ఉంటే నేడు 75 కు చేరిందన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు , పి ఆర్ సి , భారంగా మారాయని ఆయన వివరించారు. ఏటా నికర నష్టం 12 వందల కోట్లుందని… బస్సులు నడిపితే నెలకు వంద కోట్ల నష్టం వస్తుందని ఆయన వివరించారు. ప్రతినెలా 100 కోట్లు అప్పు పెరుగుతుందన్నారు. ఆర్టీసీ దివాళా తీయాల్సిన పరిస్థితులున్నాయన్నారు. పల్లె వెలుగు , సిటీ సర్వీస్ కు 10 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. బోర్డ్ ఆమోదం, సి ఎం ఆమోదం తో అమలు చేస్తున్నామన్నారు.

2015 తర్వాత ఇప్పటివరకు చార్జీలు పెంచలేదన్నారు. 20 పైసలు ఇతర సర్వీసులపై పెంచుతున్నామని చెప్పారు. ఆర్టీసీ కి జీవం పోసేందుకే చార్జీ ల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ విభజన జరగాలని… విలీన ప్రక్రియ జరుగుతుందన్నారు. అద్దె బస్సులు అదనంగా పెట్టడం లేదు.. పాత వాటికి రెన్యువల్ చేసేందుకు టెండర్లు పిలుస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే 296 డ్రైవర్లు,63 కండక్టర్లను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఆర్టీసీ యాజమాన్యం జారి చేసింది. రేపటి నుంచి ఆర్టీసీ లో మహిళ కండక్టర్లు కు సెకండ్ షిఫ్ట్ లు రద్దు. ఎంత మంది మహిళా కండక్టర్లు ఉంటే అంతా మందికి ఉదయం షిఫ్ట్ వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news