రేవంత్ రెడ్డిని బిజెపిలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి…?

-

పార్లమెంట్ సమావేశాలు ఏమో గాని చాలా పార్టీలకు రాజకీయంగా తల నొప్పిగా మారాయి. తమ పార్టీ కండువా కప్పుకుని ఢిల్లీ విమానం ఎక్కిన ఎంపీలు తిరిగి అదే కండువాతో వస్తారో లేదో అనే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, తెలుగుదేశం, కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో శివసేన ఇలా చాలా పార్టీలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి అనేది వాస్తవం. తెలంగాణాలో తెరాస ఎంపీలను బిజెపి లాక్కునే ప్రయత్నం చేస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగానే వినిపించాయి. సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరుగుతుంది.

ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఇక్కడ బలపడటానికి గాను ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను ఆకర్షించే పనిలో పడినట్టు సమాచారం. ఇప్పటికే కొందరు తెరాస ఎమ్మెల్యేలకు గాలం వేసింది. ఇక తాజాగా తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని బిజెపి టార్గెట్ చేసినట్టు సమాచారం. ఆయన్ను బిజెపిలోకి వస్తే గౌరవిస్తామని… కేంద్రంలో పదవి ఇస్తామని చెప్పినట్టు సమాచారం. భవిష్యత్తులో ఎన్నికలకు కూడా సహకరిస్తామని చెప్పినట్టు తెలుస్తుంది.

ఒక కేంద్ర మంత్రి తన ఛాంబర్ లోకి పిలిచి మరీ రేవంత్ తో మాట్లాడారట. దానికి రేవంత్ ఏం చెప్పారో తెలియదు గాని వీరి మధ్య పార్టీ మారే విషయంలో కీలక చర్చ జరిగినట్టు సమాచారం. ఇక తెలంగాణా ప్రభుత్వానికి సంబంధించి కీలక విషయాలను కూడా ఆ కేంద్ర మంత్రి గారు అడిగారట. తన వద్ద ఉన్న సమాచారాన్ని కూడా రేవంత్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కాదు ఒక ఏడాది ఆగుతానని… అక్కడ పార్టీ పరిస్థితి చూసి నిర్ణయం తీసుకుంటాను అని రేవంత్ చెప్పినట్టు పుఖార్లు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news