టిల్లు స్క్వేర్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్?

-

సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ ఒక్కసారిగా డీజె టిల్లు మూవీతో ఫేమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి భారీ విజయం సాధించింది. తాజా ఈ సినిమాకి సీక్రెట్ గా వస్తున్నటువంటి టిల్లు స్క్వేర్ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ను ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెటిక్స్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీలో మురళీ శర్మ, ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 29 న థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్స్, సాంగ్ విడుదల అయి సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెంచాయి.

Read more RELATED
Recommended to you

Latest news