బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ చాయ్‌ పే చర్చ

-

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ గత కొద్దిరోజులుగా భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశయ్యారు. దిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ చాయ్‌ పే చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఇరువురు పలు రంగాలపై మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. విద్యారంగంలో మార్పులకు టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీ వినియోగించినట్లు బిల్ గేట్స్కు వివరించారు.

‘డిజిటల్‌ టెక్నాలజీతో సామాన్యులకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తున్నాం. ప్రభుత్వ అవసరం ఉన్న పేదలకు డిజిటల్‌ టెక్నాలజీ దోహదపడుతోంది. ప్రభుత్వానికి, పేదలకు మధ్య ఉన్న వ్యవస్థ వల్ల ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు నేరుగా ప్రభుత్వం నుంచే పేదవాడికి అన్నీ అందుతున్నాయి. డిజిటల్‌ రంగంలో భారత్‌ చాలా మార్పులు తీసుకొచ్చింది. నమో డ్రోన్‌ దీదీ పథకం విజయవంతంగా అమలవుతోంది. సైకిల్‌ రాని మహిళలు కూడా పైలట్లు, డ్రోన్లు ఆపరేట్‌ స్థాయికి ఎదిగారంటే అదంతా టెక్నాలజీ మహిమే.’ అని ప్రధాని మోదీ బిల్గేట్స్కు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news