ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు మొదటి టీకా నేను తీసుకున్నా: ప్రధాని

-

ప్రపంచాన్నే వణికించిన కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు క్రమపద్ధతిలో పోరాటం చేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాము ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రజలు పాటించారని తెలిపారు. ప్రజల్లో విశ్వాసం నింపే అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. కొవిడ్‌పై ఉన్న భయాందోళన వీడేందుకు వివిధ రూపాల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టిట్లు వివరించారు. దిల్లీలోని పీఎం కార్యాలయంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో ప్రధాని మోదీ చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశంలో గేట్స్కు మోదీ భారత్ గత కొన్నేళ్లలో ఎదుర్కొన్న సవాళ్లు, ఎదురొడ్డి పోరాడిత తీరును, అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగాన్ని వివరించారు. కరోనా గడ్డుకాలంలో ప్రజలు మమ్మల్ని ప్రశ్నించకుండా మహమ్మారి నివారణకు తోడ్పడ్డారని గేట్స్కు తెలిపారు మోదీ. ప్రజల్లో విశ్వాసం, చైతన్యం నింపడం ద్వారా విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నామని చెప్పారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలోనూ ప్రజల్లో విశ్వాసం నింపామన్న ప్రధాని .. టీకాపై అపోహలు, అనుమానాలు నివృత్తి చేశామని పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు మొదటి టీకా తాను తీసుకున్నానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news