8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారు -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని బీజేపీ కులగొడతాం అంటే ప్రజలు ఊరుకుంటారా….? ఇదేమైనా.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర కాదన్నారు. తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవసరం అయితే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

లోక్ సభ ఎన్నికల తరువాత హరీశ్ రావు బీజేపీలో చేరుతాడన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలే అయింది. మాపై దాడి చేయడం కేకే లాంటి సీనియర్ నేతలకు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్  పార్టీలో ఎవ్వరికీ టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తామని వివరించారు. నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలిందని సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news