బంజారాహిల్స్‌లో అనుచరులతో కడియం శ్రీహరి సమావేశం

-

వివిధ కారణాలతో ప్రజలు బీఆర్ఎస్కు దూరమవుతున్నారని, కాంగ్రెస్‌లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని బీఆర్ఎస్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. కడియం కుమార్తె, వరంగల్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కావ్య పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించగా.. శ్రీహరి కూడా పార్టీని వీడుతున్నట్టు స్పష్టమైంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నేతలు కడియంతో భేటీ అయి పార్టీలోకి కూడా ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని కడియం చెప్పారు.

తాజాగా ఈ విషయంపైనే కడియం దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ బంజారాహిల్స్లో తన అనుచరులు, కార్యకర్తలతో కడియం శ్రీహరి భేటీ అయ్యారు. బీఆర్ఎస్కు రాజీనామా, కాంగ్రెస్లో చేరికపై తన అనుచరులతో చర్చించారు. ఈ సమావేశంలో కడియం కావ్య కూడా పాల్గొన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా… కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు కడియం శ్రీహరి తెలిపారు. ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news