బీఆర్ఎస్ మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలంగాణ భవన్ లోని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ప్రజలకి రైతులకు ఉపయోగపడే పనులు చేయలేదని అన్నారు. వేసవి రాకముందు సాగు తాగునీటి సమస్య రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తుతం కేసీఆర్ పరిపాలన అధ్యక్షత ఏంటో ప్రజలకు తెలిసిందని, కరువు కాలంలో కేసీఆర్ ఉంటే బాధలు ఉండవని రైతులు అంటున్నారు.
ప్రస్తుత కాలంలో కేసీఆర్ పరిపాలనధ్యక్షత ఏంటో ప్రజలకు తెలిసిందని చెప్పారు వర్షాలు రాకపోతే రైతులు కోసం ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రణాళిక లేదని అధికారంలోకి రాగానే డబ్బులు ఎలా రాబట్టుకోవాలని ధ్యాస మాత్రమే ఉందని చెప్పారు 15 రోజుల నుండి బీఆర్ ఎస్ పార్టీ నేతలు పొలాల వెంట తిరుగుతున్నారని చెప్పారు రైతు భరోసా కింద 15000 ఇస్తామని అన్నారు.