విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన మూవీ ఫ్యామిలీ స్టార్ కి పరుశురాం దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. గీత గోవిందం వంటి హిట్ తర్వాత విజయ్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. దీంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్ ప్రమోషన్స్ ని స్పీడ్ గా పెంచేశారు. ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా లైగార్ ఫెయిల్యూర్ మీద స్పందించారు.
సినిమా విడుదలకు ముందే దాని ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని విజయ్ దేవరకొండ అన్నారు. లీగర్ మూవీ కి ముందు తర్వాత నా వైఖరిలో మార్పు లేదు అయితే ఒక విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నాను. సినిమా విడుదలకి ముందు ఫలితం గురించి అసలు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. లైగర్ తర్వాత నుండి ఇదే అమలు చూస్తున్న నేను విధించుకున్న ఓ శిక్ష అని విజయ్ దేవరకొండ అన్నారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన లైగర్ సినిమా పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.