14 ఎంపీ స్థానాలు తెలంగాణ కాంగ్రెస్ గెలుస్తుంది..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లను గెలిచే ఛాన్స్ ఉందని ఐటి మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనే భయంతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పన్నుల రూపంలో వచ్చిన ప్రజలని డబ్బులని ప్రజలకే ఖర్చు చేస్తామని చెప్పారు.

ఎండాకాలం నేపథ్యంలో నీటి అవసరాలని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళిక రూపొందించాము అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ తీసుకువచ్చిన మిషన్ భగీరథ తప్పుడు పథకమని అన్నారు. నీటి సరఫరా చేస్తామని 45 వేల కోట్లు ఖర్చు చేస్తారని, 45 వేల కోట్లు ఖర్చుపెట్టిన కానీ నీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ప్రస్తుతం శ్రీధర్ బాబు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news