ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. గురువారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు కేటీఆర్ మాకు లీగల్ నోటీసులు పంపించారు పరిజ్ఞానం లేదు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వారు రూములు ఏర్పాటు చేసి టైపింగ్ చేశారని మీడియాలో అనేక కథనాలు అయితే వచ్చాయి. మీడియాలో వచ్చిన వార్తలని చూసి విచారణ చేయాలని డిసిపి కి కంప్లైంట్ చేశాను. నా ఫోన్ కూడా టాపింగ్ జరిగిందేమో అనే సందేహంతో ఫిర్యాదు చేశాను.
ఫార్మ్ హౌస్ గెస్ట్ హౌస్ లో కూర్చుని పరిపాలన చేశారని క్లియర్ గా తెలుస్తోంది ఇప్పటికే ఈ కేసు అధికారులు సస్పెండ్ అయ్యారు లీగల్ నోటీసులని పంపించి కేటీఆర్ తమని బెదిరించాలని చూస్తున్నాడు. టాస్క్ ఫోర్స్ వాహనాలతో డబ్బులు చేరవేశామని రిమాండ్ లో ఉన్న పోలీసు అధికారులు అన్నారు ఇందిరాగాంధీ అఫీషియల్ గా వాహనాలు వాడుకుందని అలహాబాద్ కోర్టు అనర్హత వేటు వేసింది అని అన్నారు. అయితే ఇది కొన్ని మీడియా కథనాలని బట్టి వస్తున్న వార్త తప్ప ఇందులో నిజం ఎంత అనేది తెలియదు.