కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో షాక్

-

కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ త‌గిలింది. రోడ్లు భద్రతా పన్ను పేరిట ప్రజలపై మరో భారం వేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోడ్లు భద్రతా పన్నుతో సంవత్సరానికి రూ. 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారిపై మరో కొత్త పన్ను విధించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నారు.

Telangana government gives another shock to those buying new vehicles
Telangana government gives another shock to those buying new vehicles

రోడ్ల భద్రత సెస్ పేరిట ద్విచక్ర వాహనంపై రూ. 2 వేలు, కార్లపై రూ.5 వేలు, ఇతర హెవీ వాహనాలపై రూ. 10 వేలు వసూలు చేయాలని నిర్ణయించింది రవాణా శాఖ. ఈ సరికొత్త సెస్ వల్ల సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఈ సెస్ వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన వెంటనే అమలు చేసే ఆలోచనలో రవాణా శాఖ ఉన్న‌ట్లు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news