నటి స్నేహ ఉల్లాల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. స్నేహ ఉల్లాల్ ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించింది. తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంది చాలాకాలం గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు రియంట్రీ ఇవ్వనుంది కామెడీ హారర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులు ముందుకి వస్తోంది. ప్రస్తుతం ఈమె భవనం అనే హారర్ సినిమాలో నటిస్తోంది.
సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకి వస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాలు పెద్ద హిట్లు అయ్యాయి స్నేహ ఉల్లాల్ తో పాటుగా పాపులర్ కమెడియన్ సప్తగిరి ధనరాజ్ తదితరులు నటిస్తున్నారు. టీజర్ సీన్స్ ఒక్కొక్కటి ఘోస్ట్ పంపిస్తే టైటిల్ కి తగ్గట్టుగా పెద్ద భవనం కనబడుతోంది మరి స్నేహ ఈ సినిమాతో మళ్ళీ అవకాశాలని పొందుతుందా లేదా చూడాలి.